లింగాయత్​లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

లింగాయత్​లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
  • రూ.వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలి
  • వీర శైవ లింగయాత్ లింగ బలిజ సంఘం

ముషీరాబాద్, వెలుగు: కాంగ్రెస్ హయాంలోనే బసవ భవనాన్ని పూర్తి చేయాలని వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం విజ్ఞప్తి చేసింది. కార్పొరేషన్ ఏర్పాటు చేసి, వెయ్యి కోట్ల బడ్జెట్​ ఇవ్వాలని కోరింది. ఆదివారం బలిజ సంఘం ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప , రాష్ట్ర అధ్యక్షులు పటోల సంగమేశ్వర మాట్లాడుతూ  భవనానికి  భూమి పూజ  చేసి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు నిర్మాణం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.   కాంగ్రెస్​ ప్రభుత్వంలో అయినా  నిర్మాణం పూర్తి కావాలని కోరారు. అనంతరం అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దినేశ్​ పాండే, కోశాధికారి రాచప్ప, శెట్టి శివకుమార్,శెట్టి శ్రావణి, అశ్విని, మల్లికార్జున్ పాల్గొన్నారు.